మార్నింగ్ షూటింగ్ ఉంటే మధ్యాహ్నం 3గంటలకు వస్తున్నారు : సోనూసూద్
సినిమా నిర్మాణంలో వృథా ఖర్చు పెరిగిపోతోందని నటుడు సోనూసూద్ అన్నారు.
సినిమా బడ్జెట్‌లపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ సినిమా షూట్‌ల సమయంలో వృధా ఖర్చు పెరుగుతుందని సోనూసూద్ అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతేహ్’ . జాక్వెలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోనూసూద్ మాట్లాడారు. నటీనటులు ఆలస్యంగా షూటింగ్‌కు రావడం, విదేశాల్లో షూటింగ్‌కు 100 మంది అవసరమైతే 150-200 మంది సిబ్బందిని నిర్మాత తీసుకెళ్తున్నారని వెల్లడించారు.
కేవలం 12మందితో సమర్థంగా షూటీంగ్ జరిపామని. చిత్రీకరణకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నా, అది తెరపై కనిపించడం లేదు. ఉదాహరణకు ఒక నటుడికి ఉదయం కాల్షీట్ ఉంటే, మధ్యాహ్నం 3గంటలకు వస్తున్నాడు. అలాగే, షూటింగ్ విరామ సమయంలో సెట్‌లో కూర్చోకుండా వెళ్లి వ్యాన్‌లో ఉంటున్నారు. షాట్ రెడీ అని చెప్పగానే, తీరుబడిగా వస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో షూటింగ్ ఉంటే, నిర్మాతలు మరీ ఎక్కువగా ఖర్చు చేసేస్తున్నారు. 100మంది వ్యక్తులు అవసరమైన పనికి 150-200 మందిని తీసుకెళ్తున్నారు. మరి బడ్జెట్ పెరగకుండా ఏమవుతుందని సోనూసూద్ అన్నారు.