క్షమాపణలు చెప్పిన శ్రీముఖి ఎందుకంటే

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు.

Advertisement
Update:2025-01-08 19:48 IST

బుల్లితెర యాంకర్ శ్రీముఖి హిందూవులకు క్షమాపణలు చెప్పింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖి, రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని వ్యాఖ్యానించింది. దీంతో శ్రీముఖి కామెంట్స్‌పై పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి. వెంటనే సారీ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయి. హిందూ సంఘాలు సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‍అసలు నీకు రామాయణం తెలుసా? అని చాలామంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది.

వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ..' రీసెంట్ టైమ్స్‌లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్‌లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ మాట్లాడింది. 

Tags:    
Advertisement

Similar News