డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్.. బాలయ్య అభిమానులకు పండుగే
డాకు మహారాజ్ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
Advertisement
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. బాలయ్య ఫ్యాన్స్‌లో మరింత ఉత్తేజాన్ని నింపేందుకు రిలీజ్ ట్రైలర్ పేరిట మరో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో బాబీ దర్శకత్వలో డాకు మహారాజ్ తెరకెక్కుతుంది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. 2023లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు
Advertisement