OSM Stream City Qik | 15 నిమిషాల్లో ఓఎస్ఎం ఆటో రిక్షా చార్జింగ్‌.. దీని ధ‌రెంతంతో తెలుసా..?!

OSM Stream City Qik | ఎక్స్‌పోనెంట్ ఎన‌ర్జీ (Exponent Energy) స‌హ‌కారంతో ఒమెగా సైకీ మొబిలిటీ (Omega Seiki Mobility (OSM) స‌రికొత్త ఎల‌క్ట్రిక్ త్రీ వీల‌ర్ ఆవిష్క‌రించింది. న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ (Stream City Qik) అనే పేరుతో త్రీవీల‌ర్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

Advertisement
Update:2024-04-14 13:22 IST

OSM Stream City Qik | ఎక్స్‌పోనెంట్ ఎన‌ర్జీ (Exponent Energy) స‌హ‌కారంతో ఒమెగా సైకీ మొబిలిటీ (Omega Seiki Mobility (OSM) స‌రికొత్త ఎల‌క్ట్రిక్ త్రీ వీల‌ర్ ఆవిష్క‌రించింది. న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ (Stream City Qik) అనే పేరుతో త్రీవీల‌ర్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధ‌ర రూ.3.25 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. ఓఎస్ఎం స్ట్రీం సిటీ కిక్ (OSM Stream City Qik) ఎల‌క్ట్రిక్ ఆటో రిక్షా ఎక్స్‌పోనెంట్ 8.8కిలోవాట్ల ప్రొప్రైట‌రీ బ్యాట‌రీ (Exponent's 8.8kWh proprietary battery) ప్యాక్‌తో ప‌ని చేస్తుంది. ఎక్స్‌పోనెంట్ రాపిడ్ చార్జింగ్ నెట్‌వ‌ర్క్‌తో కేవ‌లం 15 నిమిషాల్లో ఓఎస్ఎం స్ట్రీం సిటీ కిక్ ఆటో రిక్షా బ్యాట‌రీ చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్ చేస్తూ న‌గ‌ర ప‌రిధిలో 126 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది.

ఓఎస్ఎం స్ట్రీం సిటీ కిక్ (OSM Stream City Qik) ఆటో రిక్షా ఐదేండ్లు లేదా రెండు ల‌క్ష‌ల కి.మీ వ‌ర‌కూ వారంటీ అందిస్తుంది. 100 శాతం రాపిడ్ చార్జింగ్‌తో ఎక్స్‌పోనెంట్ 3000 సైకిల్ లైఫ్ వారంటీ అందిస్తుంది. ఈ-ప్ల‌గ్ అనే చార్జింగ్ క‌నెక్ట‌ర్‌తో ఈ-పంప్ చార్జింగ్ స్టేష‌న్ వ‌ద్ద ఈ-ప్యాక్‌తో బ్యాట‌రీ ప్యాక్‌ను ఎక్స్‌పోనెంట్ త‌యారు చేసింది. 15 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ చేయొచ్చు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగ‌ళూర్ ప‌రిధిలో ఈ ఏడాది 100 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల చార్జింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. హైద‌రాబాద్‌తోపాటు చెన్నై, అహ్మ‌దాబాద్, కోల్‌క‌తా న‌గ‌రాల‌కు త‌న నెట్‌వ‌ర్క్‌ను ఎక్స్‌పోనెంట్ విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక రూపొందించింది.

ఓఎస్ఎం ఫౌండ‌ర్‌, చైర్మ‌న్ ఉద‌య్ నారంగ్ స్పందిస్తూ.. ఓఎస్ఎం స్ట్రీం సిటీ కిక్ కేవ‌లం ఒక ఆటో రిక్షా మాత్ర‌మే కాదు. ఆర్థిక సాధికార‌త‌కు ఉత్ప్రేర‌కంగా ఉంటుంది. 15 నిమిషాల్లో శ‌ర‌వేగంగా చార్జింగ్ సామ‌ర్థ్యం ఎక్స్‌పోనెంట్ సామ‌ర్థ్యం. దీంతో ఆటో రిక్షా డ్రైవ‌ర్లు గ‌ణ‌నీయ లాభాలు గ‌డించేందుకు మార్గం సుగ‌మం అవుతుంది. డౌన్ టైం క‌నీస స్థాయికి త‌గ్గించ‌డంతోపాటు గ‌రిష్ట ఎఫిషియెన్సీ అందిస్తుంది. ప్ర‌తి ప్రయాణంలో ఆటో రిక్షా డ్రైవ‌ర్ల‌కు ఆర్థిక లాభాలు సంపాదించి పెడుతుంది. భ‌విష్య‌త్ మొబిలిటీకి దిశా నిర్దేశం చేస్తుంది. జీవ‌న ప్ర‌మాణాల మెరుగుద‌ల‌కు, ఆర్థిక స్వాతంత్య్రంతో సామాజిక అభ్యున్న‌తి సాధించ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది అని అన్నారు.

Tags:    
Advertisement

Similar News