హాస్పిటల్‌లో చేరిన ఆర్బీఐ గవర్నర్‌

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న వైద్యులు

Advertisement
Update:2024-11-26 10:04 IST

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ఆర్‌బీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఎలాంటి ఆందోళన చెందనక్కరలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరో రెండు, మూడు గంటల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉన్నదన్నారు. 

Tags:    
Advertisement

Similar News