మళ్లీ రూ. 80,000 మార్క్‌ చేరిన పసిడి ధర

బంగారం ధరకు ఆజ్యం పోస్తున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన భౌగోళిక-రాజకీయ అనిశ్చిత్తులు

Advertisement
Update:2024-11-25 08:01 IST

దేశీయ విపణలో 10 గ్రాముల పసిడి ధర మళ్లీ రూ. 80,000 మార్క్‌ను అధిగమించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో, ఆయన అధిక టారిఫ్‌ వాణిజ్య విధానంపై అంచనాలు ఉండటంతో బంగారం ధర భారీగా తగ్గింది. అమెరికా ఎన్నికల ఫలతాలు వెల్లడైన రోజు మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు 8.5 శాతం (రూ.6775) మేర తగ్గి రూ. 73,000కు చేరింది. అమెరికా డాలర్‌ సూచీ సైతం 101 డాలర్ల నుంచి 107.5 డాలర్లకు చేరడంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. తాజాగా మళ్లీ పసిడి రికార్డు ధరకు చేరింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన భౌగోళిక-రాజకీయ అనిశ్చిత్తులు బంగారం ధరకు ఆజ్యం పోస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) పసిడి ధర 2,700 డాలర్లను అధిగమించింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) వడ్డీ రేట్ల పాలసీలో జాగ్రత్త వైఖరి, బలమైన యూస్‌ డాలర్‌ తదితర అంశాలు బులియన్‌ మార్కెట్‌కు సవాల్‌ విసురుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌ - రూ.79, 630, రూ. 72,990

విజయవాడలో - రూ. 79, 630, రూ. 72, 990

చెన్నై- రూ. 79, 630, రూ. 72, 990

బెంగళూరు -రూ.79,655 73,015

కోల్‌కతా -రూ.79, 630, రూ. 72, 990

ఢిల్లీ - రూ. 79, 780, రూ. 73, 140

ముంబయి -రూ.79, 630, రూ. 72, 990

పుణె -రూ.79, 630, రూ. 72, 990

Tags:    
Advertisement

Similar News