భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు భారీగా పతనం

Advertisement
Update:2024-11-21 10:37 IST

అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు వ్యవహారం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమవుతున్నాయి.10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 578 పాయింట్లు తగ్గి 76,999 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 203 పాయింట్లు తగ్గి 23,314వద్ద కొనసాగుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.41గా ఉన్నది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారత బిలియనీర్‌, అదానీ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆ గ్రూప్‌ సంస్థల స్టాక్ష్‌ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. 




Tags:    
Advertisement

Similar News