రూలింగ్ పార్టీలమేనేజ్మెంట్ గురు గౌతం అదానీ

2 బిలియన్ డాలర్ల లాభం కోసం 250 మిలియన్‌ డాలర్లకు పైగా లంచం. న్యూయార్క్‌లో కేసు నమోదు

Advertisement
Update:2024-11-21 09:51 IST

భారత్‌లో పోర్టులు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రామిక వేత్తగా కొనసాగుతున్న అదానీ అమెరికాలో నిధుల సేకరణ కోసం భారత అధికారులకు 250 మిలియన్‌ డాలర్లకు పైగా లంచం ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు బిలియన్‌ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరు ఓ కాంట్రాక్టు విషయంలో 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభం పొందగల సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందాలను పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అధికారులు అభియోగాలు మోపారు. ఈ విషయంపై అదానీ గ్రూప్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

ఒడిశా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ ఒప్పందం చేసుకోవడానికి కేంద్ర విద్యుత్‌ సంస్థ అధికారులకు 265 బిలియన్‌ డాలర్ల లంచాలు ఇచ్చినట్లు అమెరికా న్యాయశాఖ బైటపెట్టింది. ఈ మేరకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా( SECI)అధికారులకు లంచాలు ఇవ్వ జూపాడు. 2021 జులై -2022 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ లావాదేవీలు జరిగినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు. ఇలా లంచాలు ఇవ్వడం ద్వారానే దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఏడు గిగావాట్ల సోలార్ పవర్‌ పంపిణీ ఒప్పందం చేసుకోగలిగాడని అమెరికా న్యాయశాఖ అధికారులు తమ నివేదికలో వెల్లడించారు.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది. ఇటీవల సెబీ ఛైర్‌ పర్సన్‌, అదానీ గ్రూప్‌ వాణిజ్య భాగస్వామ్యంపై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసింది. దీన్ని అదానీ గ్రూప్‌ కొట్టిపారేసింది. ఆఫ్రికాలోని కెన్యా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో అవకతకలు జరిగాయని ఆరోపణలు రావడం, ఈ ప్లాంటుకు వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలుపడంతో ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లింది. కెన్యా కోర్టు 736 మిలియన్ల అదానీ విద్యుత్ లైన్ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. అదానీ- మోడీ ల బంధంపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ నిత్యం విమర్శలు చేస్తున్నారు. మోడీ ఆయన అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇక్కడ తెలంగాణలో అదానీ కంపెనీలు పెట్టుబడులు పెడుతానని ముందుకు వస్తే రెడ్‌ కార్పేట్‌ పరిచారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ వర్సిటీకి కూడా అదానీ గ్రూప్‌ ఇటీవల భారీ విరాళం అందించిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News