పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త . ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి.

Advertisement
Update:2024-11-18 07:50 IST

పసిడి ప్రియులకు శుభవార్త . ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. కొనేవారికి ఇది మంచి సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దిగి రావడం వల్ల ఆ ప్రభావం విదేశీ మార్కెట్లపై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆ ప్రభావం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలపై కూడా కనిపించింది..ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 75, 640 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 69, 340 గా ప‌లుకుతుంది. అంటే ఏకంగా 7వేలు తగ్గింది బంగారం ధర. గత నెల చివరి వారం వరకు రేసు గుర్రంలా పరుగెత్తిన గోల్డ్ రేట్.. క్రమంగా తగ్గుతోంది. అమెరికా ఎన్నికల తర్వాత తగ్గుతూ వస్తున్నాయి బంగారం ధరలు. ఇక వెండి ధ‌ర‌లు కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 98, 900 గా నమోదు అయింది.

Tags:    
Advertisement

Similar News