దలాల్‌ స్ట్రీట్‌లో సూచీల జోష్‌

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఏకంగా వెయ్యి పాయింట్లు లాభపడగా.. 23,750 స్థాయిని అందుకున్న నిఫ్టీ

Advertisement
Update:2024-11-19 13:56 IST

బలహీన త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో వరుస నష్టాలు చవిచూసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. సుమారు ఏడు సెషన్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సూచీలు నేడు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఏకంగా వెయ్యి పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ తిరిగి 23,750 స్థాయిని అందుకున్నది. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ 6 లక్షల కోట్ల మేర పెరిగి రూ. 435 లక్షల కోట్లకు చేరింది.

మధ్యాహ్నం 1 గంటలకు తర్వాత గంటలకు సెన్సెక్స్‌ 1,016 పాయింట్ల లాభంతో 78,355 వద్ద నిఫ్టీ 297 పాయింట్ల లాభంతో 23,751 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ మినహా అన్ని షేర్లూ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థలు అయిన సీఎల్‌ఎస్‌ఏ, సిటీ తమ దృష్టిని మళ్లీ భారత్‌ వైపు మళ్లించడం ప్రధాన కారణమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత మార్కెట్ల నుంచి చైనా మార్కెట్లకు మళ్లాలన్న తన గత వ్యూహాన్ని సీఎల్‌ఎస్‌ఏ మార్చకొని భారత్‌లో పెట్టుబడుల కేటాయింపులను పెంచాలని ఇటీవల నిర్ణయించింది. దీనికితోడు ట్రంప్‌ 2.0 లో చైనాపై వాణిజ్య ఆంక్షలు తప్పవన్న అంచనాలను వెలువరించింది. సిటీ గ్రూప్‌ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. 

Tags:    
Advertisement

Similar News