పేరు మారింది ...ఇకపై MTR ఫుడ్స్ కాదు.. ఓర్క్లా ఇండియా ..

గులాబ్ జామ్, సాంబార్ పొడి, గరం మసాలా, మసాలా ఉప్మా పౌడర్… ఇవన్నీ విడివిడిగా వేర్వేరు పదార్థాలు. కానీ వీళ్ళ వీటన్నింటినీ ఒకే బ్రాండ్ కలిపి ఉంచుతుంది అదే ఎంటీ ఆర్. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఇది అగ్రగామి.

Advertisement
Update:2023-10-13 18:27 IST

గులాబ్ జామ్, సాంబార్ పొడి, గరం మసాలా, మసాలా ఉప్మా పౌడర్… ఇవన్నీ విడివిడిగా వేర్వేరు పదార్థాలు. కానీ వీళ్ళ వీటన్నింటినీ ఒకే బ్రాండ్ కలిపి ఉంచుతుంది అదే ఎంటీ ఆర్. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఇది అగ్రగామి. దేశవ్యాప్తంగా అందరి ఇళ్లలోను ఈ బ్రాండ్ కు చందిన ఎదో ఒక పొడి లేక స్వీట్, లేకపోతే కనీసం మసాలా పౌడర్ అయినా ఉండకుండా ఉండదు.

అయితే ఎప్పుడు అందరికీ అలవాటు అయిన ఆ పేరు మారబోతోంది. ఇకపై MTRఫుడ్స్ ను ఓర్క్లా ఇండియాగా వ్యహరించనున్నారు. నిజానికి దేశంలోని ప్యాక్ చేసిన మసాలా దినుసులు మరియు సౌకర్యవంతమైన ఆహారాల మార్కెట్‌లలో నిర్వహిస్తున్న కంపెనీ పేరు ఓర్క్లా. నార్వేజియన్ పారిశ్రామిక పెట్టుబడి సంస్థ ఓర్క్లా 2007లో MTR ఫుడ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అయ్యింది. 2020లో, కేరళకు చెందిన మసాలా దినుసుల తయారీ సంస్థ ఈస్టర్న్ కాండిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ 67.8% వాటాను కైవసం చేసుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న MTR ఫుడ్స్, ఈస్టర్న్ కండీమెంట్స్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లను ఒకే తాటికిందకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు MTR, ఈస్టర్న్ మరియు ఇంటర్నేషనల్ బిజినెస్ (IB) అనే మూడు వ్యాపార విభాగాలను సృష్టించడం ద్వారా ఓర్క్లా ఇండియాను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓర్క్లాతన కార్యకలాపాలను మూడు వ్యాపార విభాగాలుగా పునర్నిర్మిస్తున్నట్టుగా ప్రకటించింది. MTR, ఈస్టర్న్ మరియు ఇంటర్నేషనల్ బిజినెస్. ఈ యూనిట్లలో ప్రతి ఒక్కటి దాని స్వంత సిఈఓను కలిగి ఉంటుంది, ఇప్పుడు ఓర్క్లా ఇండియా కంపెనీ సీఈవోగా గతంలో MTR సీఈఓగా పని చేసిన సంజయ్ శర్మ వ్యవహరించనున్నారు.

ప్రతి ఇంట్లోనూ రుచులకు ఘుమఘుమలు జోడిస్తున్న ఎంటీఆర్ ఫుడ్స్ గత కొంతకాలంగా ఏ ఏ ప్రాంతాలకు చెందిన వారి రుచులను ఆ ప్రాంతాల వారికి అందించేలా విభిన్న ప్రయోగాలు చేసింది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల వారికి కందిపొడి, కరివేపాకు పొడి వంటివి. ఈ కారణంగానే ఎంటీఆర్ అందరి వంటింట్లోలోనూ చోటు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు పేరు మాత్రమే మారుతుంది గాని వాటి తీరు మారదని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. తాజాదనం, నాణ్యతల , రుచుల కలబోతతో వచ్చే తమ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అందరికీ ఎప్పటిలాగానే అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News