ఇన్వెస్టర్లకు కాస్త ఊరట
నిన్నటి పతనం తర్వాత లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Advertisement
స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడవుతున్నాయి. సోమవారం భారీ పతనం తర్వాత మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో సెన్సెక్స్ 232.16 పాయింట్లు లాభపడి 78,197.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 115.75 పాయింట్లు లాభంతో 23,731.80 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 423 పాయింట్లు, నిఫ్టీ 137 పాయింట్ల లాభంలో కొనసాగగా గంట తర్వాత కాస్త తగ్గాయి. టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జొమాటో, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Advertisement