స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

50 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌, 18 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

Advertisement
Update:2025-01-08 16:33 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నుంచి మిక్సుడ్‌ రిజల్ట్స్‌ నేపథ్యంలో ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. తర్వాత కాస్త కోలుకున్నట్టు కనిపించినా చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 78,319.45 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమవగా ఒక దశలో 78,319 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. చివరికి 50 పాయింట్లు నష్టపోయి 78,148.49 వద్ద ముగిసింది. నిష్టీ 18 పాయింట్లు కోల్పోయి 23,688 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) గ్యాస్‌ ఆధారిత షేర్లు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్లు స్వల్ప నష్టాలతోనే కొనసాగాయి. 

Tags:    
Advertisement

Similar News