వెండికీ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి

3-6 నెలల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన బీఐఎస్‌ డైరెక్టర్‌

Advertisement
Update:2025-01-07 09:39 IST

వెండి దెమ్మెలు (కిలోగ్రాం పరిణామంలో విక్రయించేవి) వెండి వస్తువుల్లో వెండి నాణ్యత ఎంత ఉన్నదో గుర్తించడానికి ఉపయోగపడే హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరిగా అమలు చేసే ప్రక్రియ చేపట్టాలని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌)ను కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. వినయోగదార్ల డిమాండ్‌ మేరకే ఈ సూచన చేసినట్లు బీఐఎస్‌ 78వ వ్యవస్థాపక కార్యక్రమంలో మంత్రి పేర్కొన్నారు.ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నది, అన్నివర్గాలతో చర్చలు పూర్తయ్యాక, సాధ్యాసాధ్యాలను బీఐఎస్‌ మదింపు చేశాక, దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని మంత్రి వివరించారు. వినియోగదార్లు, ఆభరణాల డీలర్ల నుంచి స్పందనలను తీసుకోవాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బీఐఎస్‌ను కోరినట్లు తెలిపారు.ప్రస్తుతం వెండి స్వచ్ఛతను నిర్ణయించే హాల్‌మార్కింగ్‌ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉన్నది. తప్పనిసరి కాదు. ప్రస్తుతం అన్నివర్గాలతో చర్చలు జరుగుతున్నాయని, 3-6 నెలల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌కుమార్‌ తివారీ పేర్కొన్నారు.

ఆరు అంకెల ప్రింటింగ్‌

బంగారం ఆభరణాలపై ముద్రిస్తున్నట్లే, వెండిపైనా 6 అంకెలు, అక్షరాలతో కూడిన ప్రత్యేక కూడిన ప్రత్యేక కోడ్‌ (హెచ్‌యూఐడీ) ను ముద్రించే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. పలుమార్లు జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందని తివారీ అన్నారు. గుజరాత్‌, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి కొంత సమయం కోరుతున్నట్లు వివరించారు.

Tags:    
Advertisement

Similar News