రిజర్వ్‌ బ్యాంక్‌ లో 876 టన్నుల బంగారం

భారీగా బంగారం కొనుగోలు చేసిన ఆర్‌బీఐ

Advertisement
Update:2025-01-06 20:41 IST

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఏకంగా 876 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 2024లో నవంబర్‌ వరకే ఆర్‌బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. నిరుడు పోలండ్‌ తర్వాత అత్యధికంగా బంగారం కొనుగోలు చేసింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాత్రమే. నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పోలాండ్‌ 2024లో 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. నవంబర్‌ నెలలో ఆర్‌బీఐ సహా దేశంలోని నేషనలైజ్డ్‌ బ్యాంకులు 53 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దానినే అదునుగా తీసుకున్న రిజర్వ్‌ బ్యాంక్‌ తో పాటు నేషనలైజ్డ్‌ బ్యాంకులు ఎక్కువగా బంగారం కొన్నాయని డబ్ల్యూజీసీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం, ఇతర కారణాలతోనే బ్యాంకులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపాయని డబ్ల్యూజీసీ పేర్కొన్నది. ఉజ్బెకిస్థాన్‌ 11 టన్నులు, కజకిస్థాన్‌ ఐదు టన్నులు, చైనా ఐదు టన్నులు, జోర్డాన్‌ నాలుగు టన్నులు, తుర్కియే మూడు టన్నుల బంగారం కొనుగోలు చేశాయి.

Tags:    
Advertisement

Similar News