తెలంగాణలో కింగ్‌ ఫిషర్‌ బీర్లు బంద్‌

ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నిలుపుదల చేసి యూబీ గ్రూప్‌

Advertisement
Update:2025-01-08 15:59 IST

తెలంగాణలో కింగ్‌ ఫిషర్‌ బీర్లు బంద్‌ అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్‌ బ్రాండ్‌ కూడా ఇదే. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌ నుంచి సరఫరా చేసిన బీర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో యునైటెడ్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు బీర్ల సరఫరా బంద్‌ చేస్తున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. కింగ్‌ ఫిషర్‌ తో పాటు యూబీ గ్రూప్‌ నకు చెందిన హీనెకెన్‌ బీర్ల సరఫరా బంద్‌ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ యూబీ గ్రూప్‌ నకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరఫరా నిలిపి వేసింది. ఎక్సైజ్‌ శాఖ భారీ ఎత్తున ఆదాయం వచ్చినా యూబీ గ్రూప్‌ నకు చెల్లింపులు చేయలేదు. దీనివెనుక వేరే బీర్‌ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశం దాగుందా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.




 


Tags:    
Advertisement

Similar News