వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్!

హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రయత్నించారని ఉదయకుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. వివేకా హత్య వార్త బయటకు వచ్చే వరకు ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారని తెలిపారు.

Advertisement
Update:2023-04-16 09:17 IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున‌ పులివెందులలో ఆయన ఇంటివద్ద సీబీఐ అరెస్ట్ చేసింది. .

సీబీఐ అధికారులు మెమోను అతని కుటుంబ సభ్యులకు అందజేసి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనుచరులు పెద్ద ఎత్తున భాస్కర్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకుని ఆయనను తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

భాస్కర్‌రెడ్డిని రోడ్డుమార్గంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తున్న‌ట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

రెండు రోజుల క్రితం అవినాష్‌రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వివేకా హత్యకు ముందు ఉదయ్‌కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్‌లో నిఘావర్గాలు గుర్తించాయి.

హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రయత్నించారని ఉదయకుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. వివేకా హత్య వార్త బయటకు వచ్చే వరకు ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News