ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అభినందించిన మంత్రి లోకేశ్‌

కోటంరెడ్డి ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని ఎక్స్‌లో పేర్కొన్న లోకేశ్‌;

Advertisement
Update:2025-03-09 15:02 IST

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మంత్రి నారా లోకేశ్‌ 'ఎక్స్‌' వేదికగా అభినందించారు. కోటంరెడ్డి ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని అందులో పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది అనడానికి ఇదొక ఉదాహరణ అని లోకేశ్‌ చెప్పారు.

60 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం: కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఒకేసారి 105 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ. 191 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. నెల్లూరు రూరల్‌లోని ప్రతి కాలనీలో రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించడానికే రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్లు తెలిపారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News