హౌరా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లాలోని గూడురు అడవయ్యకాలనీ ప్రాంతంలో విరిగిన పట్టాలు.. లోకోపైలట్‌ను అప్రమత్తం చేసిన స్థానికులు;
Advertisement
గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లాలోని గూడురు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి. స్థానికులు ఈ విషయాన్ని గమనించిన వెంటనే లోకోపైలట్‌ను అప్రమత్తం చేశారు. రెడ్ క్లాత్ ద్వారా లోకోపైలట్‌ను సునీల్ అనే వ్యక్తి అప్రమత్తం చేశాడు. రైలు పట్టాలు విరగడంతో ఆ మార్గంలో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
Advertisement