పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ రాకపోవడంపై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Advertisement
Update:2025-03-10 14:15 IST

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్శ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో నాకు 23 ఏళ్లు అనుబంధం ఉందన్నారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని ప్రజలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. కూటమి విజయానికి నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేశానని తెలిపారు. పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని.. ఈ అవకాశమే తనకు పెద్ద పదవి అని అన్నారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులు తనకు ఎప్పుడు వుంటాయని, ఎన్నికలప్పుడు కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య పిల్లలు కష్టపడి పనిచేశామని వర్మ వ్యాఖ్యానించారు.

ఇదే అంశంపై ప్రశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారె. పిఠాపురం వర్మా కు ఎమ్మెల్సీ టికెట్‌ రాకపోవడంపై కేఏ పాల్ స్పందించారు. పిఠాపురం వర్మా.. నీకు బుద్ధుందా.. చంద్రబాబు మాట నిలబెట్టుకోడని అప్పుడే చెప్పాను కదా అంటూ మండిపడ్డారు. నేను చెప్పినట్లే పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడన్నారు. పిఠాపురం వర్మకు తదుపరి జరిగే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అవకాశం ఇస్తా అన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.

Tags:    
Advertisement

Similar News