'యువత పోరు' పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
'యువత పోరు' పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి;
ఏపీలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్దమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు యువతపై కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తామని వైవీ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. జగన్ 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారని, అప్పట్లోనే 5 కాలేజీలు ప్రారంభించారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.