చంద్రబాబును అంటుంటే బాధగా ఉంది- కూనంనేని

ఏపీలో మొత్తం రౌడీయిజం నడుస్తోందన్నారు. ఏపీలో పోరాట స్వభావం ఉన్న వ్యక్తుల అవసరం ఉందన్నారు. త్వరలోనే దేశంలో అందరూ కమ్యూనిస్టుల వైపు ఆలోచించే పరిస్థితి వస్తుందన్నారు

Advertisement
Update:2022-10-03 09:09 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఏపీలో చంద్రబాబు నాయుడు లాంటి నేతలను అక్కడి అధికార పార్టీ అంటున్న మాటలు వింటే బాధగా ఉందన్నారు. తనకే బాధ కలుగుతోందని.. కానీ టీడీపీ వాళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఏపీలో మొత్తం రౌడీయిజం నడుస్తోందన్నారు. ఏపీలో పోరాట స్వభావం ఉన్న వ్యక్తుల అవసరం ఉందన్నారు. త్వరలోనే దేశంలో అందరూ కమ్యూనిస్టుల వైపు ఆలోచించే పరిస్థితి వస్తుందన్నారు. కమ్యూనిజం ఎప్పటికీ చనిపోదని ధీమా వ్యక్తం చేశారు. దామాషా పద్ధ‌తిలో సీట్లు ఇచ్చే విధానం లేకపోవడం వల్లనే తమకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోతోందన్నారు.

సీపీఐ, సీపీఎం పరస్సరం వెన్నుపోట్లు పొడుచుకున్నది నిజమేనని.. అందుకే 1999 నుంచి కోలుకోలేకపోతున్నామని కూనంనేని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీపై తమకు వ్యతిరేక భావన లేదని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కూటమితోనే తాము ఉంటామ‌ని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News