మహాకుంభమేళాకు శ్రీవారి కల్యాణ రథం

ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామన్నటీటీడీ ఛైర్మన్‌

Advertisement
Update:2025-01-08 11:30 IST

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయలుదేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేశారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ జరగనున్నది.

కల్యాణ రథం బయలుదేరిన సందర్భంగా బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామమన్నారు. 170 మంది సిబ్బందితో ఆ ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామని తెలిపారు. జనవరి 18, 26.. ఫిబ్రవరి 3,12 తేదీల్లో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని వివరించారు. కుంభమేళాను దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. 

Tags:    
Advertisement

Similar News