నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్

నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైంది.;

Advertisement
Update:2025-03-07 16:58 IST

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఎడ్ క్వశ్చన్ పేపర్ లీకైంది. కళాశాల యాజమాన్యాన్ని దీన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. అయితే, దీనిపై యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుబ్బారావును మీడియా వివరణ కోరగా... పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని, అది బయటికి ఎలా లీకైందో తెలియదని బదులిచ్చారు. కాగా, నిన్న జరిగిన పరీక్షలోనూ క్వశ్చన్ పేపర్ అరగంట ముందే బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో యూనివర్శిటీ తరపున ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్​కు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేవారు. ఈ సారి మాత్రం సీడీల్లో ప్రశ్నాపత్రాలను కాలేజీలకు పంపించారు. అరగంట ముందు సీడీ పాస్​వర్డ్​ను యాజమాన్యాలకు పంపిస్తున్నారు. ఈ విధానంలో పోలీసుల పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో యాజమాన్యాలు పాస్​వర్డ్ రాగానే ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు పంపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News