రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ల సినియారిటీ జాబితా ప్రకటిస్తాం
'వన్ క్లాస్-వన్ టీచర్' విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తానన్న మంత్రి లోకేశ్;
ఏపీ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ల సినియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. ఐబీ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. వీటి ఏర్పాటునకు నివేదిక తెప్పిస్తామని రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. 'వన్ క్లాస్-వన్ టీచర్' విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తాను. ప్రస్తుతం కేవలం 1400 స్కూళ్లలోనే ఈ విధానం ఉన్నది. 10 వేల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తాం. వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నామని చెప్పారు. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్నివర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికి ఆదర్శంగా ఏపీ నిలుస్తుందని మంత్రి అన్నారు.