రెస్ట్ తీసుకోండి... లేకపోతే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయిస్తా : మంత్రి లోకేశ్
విశ్రాంతి తీసుకుంటారా?.. అసెంబ్లీ నుంచి నుంచి సస్పెండ్ చేయించాలా మంత్రి లోకేశ్, మంత్రి నిమ్మలను ఉద్దేశించి అన్నారు;
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి నిమ్మల రామానాయుడు చేతికి క్యానులా పెట్టకుని వచ్చారు. దీన్ని గమనించిన మంత్రి లోకేశ్ ... నిన్న ఆ చేతికి ఉంది... ఇవాళ ఈ చేతికి వచ్చింది అంటూ ఆరా తీశారు. నిన్న చేతికి కేనలా ఉండడం చూసే, బయటికొచ్చి ఆ విషయం అడిగానని తెలిపారు. అందుకు నిమ్మల బదులిస్తూ... రాత్రి హైదరాబాద్ కూడా వెళ్లొచ్చానని వెల్లడించారు. మీరు రెస్ట్ తీసుకోవాలి... లేకపోతే సభ నుంచి సస్పెండ్ చేయమని చెప్పమంటారా... అంటూ లోకేశ్ చమత్కరించారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సున్నితంగా మందలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై స్పందించారు. రామానాయుడు పని రాక్షాసుడు ప్రజాసేవతోపాటు మీ హెల్త్ చూసుకోండి. ఫీవర్ తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు ఇది నా రూలింగ్ అని డిప్యూటీ స్పీకర్ అన్నారు