పీవీ రమేష్ తాపత్రయమంతా తెలుగుదేశం ఆగ్రహానికి గురికాకూడదనేనా..?

మొదట సీఐడీ అధికారులు ఈ కేసు విషయంలో పీవీ రమేష్ ని విచారించినప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఎంత కీలకమైనదో పూసగుచ్చినట్టు చెప్పారట. ఆ ఆధారాలను సీఐడీ వాళ్లు కోర్టులో సబ్మిట్ చేసినట్టు పీవీ రమేష్ కి తెలియడంతో.. ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Advertisement
Update:2023-09-12 11:42 IST

గత రెండు రోజులుగా పీవీ రమేష్, మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లోకేష్ కన్నా, అచ్చెన్నాయుడు కన్నా మించి చంద్రబాబుని అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే..? చాలా కీలకమైన వ్యక్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఈరోజు చంద్రబాబుమీద స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఇంత బలంగా నిలబడటానికి పీవీ రమేష్.. సీఐడీకి, జడ్జి ముందు ఇచ్చిన స్టేట్ మెంట్లు కూడా ఒక కారణం అని తెలుస్తోంది.

మొదట సీఐడీ అధికారులు ఈ కేసు విషయంలో పీవీ రమేష్ ని విచారించినప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఎంత కీలకమైనదో పూసగుచ్చినట్టు చెప్పారట. సీఐడీ అధికారులు సీఆర్పీసీ 161 స్టేట్ మెంట్ కింద మొత్తం రికార్డ్ చేశారు. ఆ తర్వాత జడ్జి ముందు కూడా సీఆర్పీసీ 164 స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. జడ్జి ముందు కూడా ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర గురించి వివరంగా పీవీ రమేష్ చెప్పినట్టు ఆడియో, వీడియో ఆధారాలున్నాయని తెలుస్తోంది. వాటిని సీఐడీ వాళ్లు కోర్టులో సబ్మిట్ చేసినట్టు పీవీ రమేష్ కి తెలియడంతో.. ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి, టీడీపీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికి.. పీవీ రమేష్ ఇప్పుడు ఈ విధమైన స్టాండ్ తీసుకున్నారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News