భూములు కబ్జా చేస్తే జైలుకే

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Advertisement
Update:2024-12-20 18:00 IST

భూములు కబ్జా చేస్తే జైలు గుర్తుకు వచ్చేంత కఠినంగా వ్యవహరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని.. కబ్జాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా వాళ్ల తాతతండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు మాత్రమే దక్కాలి.. లేదంటే కొనుగోలు ద్వారానే భూమి సంక్రమించాలి.. అలా కాకుండా భూమి కనిపించింది కదా అని కబ్జాలకు పాల్పడితే జైలుకు పంపిస్తానన్నారు. ఇప్పటికే భూ కబ్జాలు, తప్పుడు సర్వేలపై లక్షలాది ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ సమస్యలపై ప్రభుత్వానికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామన్నారు. భూమి కొలతలు, సర్వే నంబర్లలో తేడాలను పరిష్కరిస్తామన్నారు. వారసుల పేర్లు కూడా సరిగా నమోదు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొత్త పాస్‌ బుక్‌లు క్యూఆర్‌ కోడ్‌తో ఇస్తామని తెలిపారు. జనవరి 9వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News