ఆ మాత్రం తెలియదా.. పిచ్చి పచ్చ రాతలెందుకు రామోజీ..?
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు భారత ఎన్నికల సంఘం 2.0ను అమలు చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తూ దేశానికి చెందిన మొత్తం డేటాబేస్‌ను ఈసీఐ తన సర్వర్ ద్వారా నిర్వహిస్తుంది.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కోసం రామోజీరావు తన బలగంతో ఈనాడులో పచ్చిగా పిచ్చి రాతలూ రాయిస్తున్నారు. తన కుట్రలోకి రాజ్యాంగబద్దమైన సంస్థలను కూడా లాగుతున్నారు. ‘ఈసీలో దొంగలు పడ్డారు’ అంటూ ఇటీవల ఈనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఎన్నికల సంఘంలో డేటా నిర్వహణ ప్రోటోకాల్స్‌పై అవగాహన లేకుండా ఆ కథనం రాయించారు. దానిపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈఓ) చీవాట్లు పెట్టింది.
పబ్లిక్ డొమైన్‌లో ఎవరైనా యాక్సెస్ చేయగల డేటాను వైసీపీ కోసం ఐప్యాక్ సభ్యులు దొంగిలించారని ఈనాడు ఆరోపించింది. తమ పనితీరు, ఐటీ వ్యవస్థ నిర్వహణపై అవగాహన లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేశారని ఈనాడు కథనంపై సీఈఓ మండిపడిరది. తమ నుంచి వివరణ కూడా తీసుకోకుండా ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా వార్తను ప్రచురించడాన్ని తప్పు పట్టింది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు భారత ఎన్నికల సంఘం 2.0ను అమలు చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తూ దేశానికి చెందిన మొత్తం డేటాబేస్‌ను ఈసీఐ తన సర్వర్ ద్వారా నిర్వహిస్తుంది. ఈసీఐ సర్వర్ రాష్ట్రాల సీఈవోల నిర్వహణలో ఉండదు. ఈసీఐ నిర్దేశించిన అత్యధునాతన భద్రతా చర్యలతో అత్యంత పారదర్శకంగా ఉండే డేటా ఫ్రేమ్ వర్క్‌లోనే సీఈవో కార్యాలయం పనిచేస్తుంది.
నిజానికి... రాష్ట్ర సీఈవోలో రెండు రకాల డేటా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఓటర్ల జాబితా డేటా, ఓటర్ల జాబితాలో మార్పులూ చేర్పులు.. తొలగింపులకు వచ్చిన దరఖాస్తు ఫారాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. ఇది పబ్లిక్ డొమైన్ ద్వారా, అంటే సీఈవో వైబ్‌సైట్ ద్వారా సాధారణ ప్రజలు కూడా చూడడానికి వీలుంటుంది. ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు హార్డ్‌డిస్క్‌ల్లో ఆ డేటాను అందిస్తారు.
ఓటర్లు మార్పులకు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరించిన జాబితా కూడా సీఈవో వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఈ డేటాను సీఈఓ ద్వారా ఫీజు చెల్లించి ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా డౌల్‌లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ల జాబితా, మార్పులు చేర్పుల అభ్యర్థనలకు సంబంధించిన డేటా తప్ప మరే ఇతర డేటా సీఈఓ స్థాయిలో అందుబాటులో ఉండదు. అందువల్ల డేటాను తొలగించడమనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయాలను మరుగునపరిచి లేదా వాటి గురించి తెలుసుకోకుండా, సీఈవో నుంచి క్లారిటీ తీసుకోకుండా ఈనాడు వార్తాకథనం ప్రచురించడం కుట్రలో భాగమే తప్ప మరోటి కాదు.