తుని రైలు దగ్ధం కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు

విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసుపై ఈ రోజు తీర్పు ఇచ్చింది. కేసు నిరూపించడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని చెప్పిన కోర్టు 41 మందిపై కేసు కొట్టి వేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి రైల్వే పోలీసుల తీరును కోర్టు తప్పుబట్టింది.

Advertisement
Update:2023-05-01 17:55 IST

2016 లో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో ‘కాపు నాడు సభ’ జరిగింది. ఆ స‌భ హింసాత్మకంగా మారి ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు పూర్తిగా కాలిపోయింది. ప్రయణీకులు ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. ఈ సంఘటనపై ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాతో సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసుపై ఈ రోజు తీర్పు ఇచ్చింది. కేసు నిరూపించడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని చెప్పిన కోర్టు 41 మందిపై కేసు కొట్టి వేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి రైల్వే పోలీసుల తీరును కోర్టు తప్పుబట్టింది.

సున్నితమైన అంశాన్ని ఇన్నేళ్లపాటు ఎందుకు సాగదీశారని పోలీసులను కోర్ట్ ప్రశ్నించింది. పోలీసు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోర్ట్ కోరింది.దగ్ధమైన రైలులో అంతమంది ప్రయాణిస్తే కేవలం ఒక్కరిని మాత్రమే ప్రశ్నించడం ఏమిటని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షిగా ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా తాను ఆ రైలులో ప్రయాణించలేదని చెప్పాడని కోర్ట్ మండిపడింది. 

Tags:    
Advertisement

Similar News