పవన్ కల్యాణ్ కి కోర్టు తీర్పు అర్థం కాలేదా..? మరి ఈ రియాక్షన్ ఏంటి..?
పవన్ లాంటి వాళ్లు ఇంత సంబరపడిపోతున్నారేంటా అని నెజిటన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ పవన్ వేసిన ట్వీట్ ఏంటి..? ఆయనకు కోర్టు తీర్పు ఎందుకు అర్థం కాలేదు..?
చంద్రబాబు బెయిల్ విషయంలో టీడీపీ సంబరాలు చేసుకోవడమే పెద్ద వింత అనుకుంటే, పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ మరో వింత అనుకోవాల్సిందే. అసలు చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ఎందుకిచ్చారు..? కోర్టు ఉద్దేశమేంటి..? పవన్ కల్యాణ్ ట్వీట్ ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూసీ చూసీ.. చివరకు మధ్యంతర బెయిల్ ద్వారా ఆయన బయటకొస్తుంటే.. పవన్ లాంటి వాళ్లు ఇంత సంబరపడిపోతున్నారేంటా అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ పవన్ వేసిన ట్వీట్ ఏంటి..? ఆయనకు కోర్టు తీర్పు ఎందుకు అర్థం కాలేదు..?
"టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి బెయిల్ లభించడం సంతోషకరం." పవన్ వేసిన ట్వీట్ లో ఇక్కడి వరకు ఇబ్బంది లేదు. అయితే ఆ తర్వాత ఆయన మరింత ఎక్కువగా స్పందించారు. "సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం." అంటూ పవన్ ట్వీట్ చేయడం విశేషం.
ఆయనేదో ఆరోగ్యం బాగోలేక, కంటి ఆపరేషన్ కోసం బయటకొస్తుంటే.. ప్రజాసేవ, పునరంకితం, ఆయన అనుభవం.. అంటూ చంద్రబాబు గురించి పవన్ ట్వీట్ వేయడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు బయటకొచ్చినా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. అసలు కుటుంబ సభ్యులతోనే మాట్లాడకూడదు, ఫోన్లు మాట్లాడకూడదు అనే కండిషన్లు కూడా ఉన్నాయంటున్నారు. అలాంటి నాయకుడు ప్రజా సేవ చేయడమేంటి, పునరంకితం కావడమేంటి..? స్కిల్ కేసులో నిర్దోషిగా బయటపడినప్పుడు వేయాల్సిన ట్వీట్.. తొందరపడి ముందే వేసినట్టుగా ఉంది పవన్ పరిస్థితి. పోనీ స్కిల్ కేసు పోయినా.. లిక్కర్ స్కామ్ తో కలిపి మరో ఐదు కేసులు ఆయన కోసం రెడీగా ఉన్నాయి. ఎలా చూసినా చంద్రబాబు అన్నిటిలోనుంచి నిర్దోషిగా బయటపడటం ఇప్పుడల్లా సాధ్యమయ్యేది కాదు. మరి పవన్ కి అంత సంబరమేంటో అర్థం కావడంలేదు. అర్జంట్ గా వచ్చి ప్రజా సేవలో పునరంకితం కావాలంటూ పవన్, చంద్రబాబుని ఉద్దేశించి కోరుకోవడం విశేషం.
♦