పవన్ డైరెక్ట్ అటాక్.. జగన్ పై మరో పోస్టర్
ఈ సినిమాకు రచన, నిర్వహణ, దర్శకత్వం.. అన్నీ జగనే అని వేయించారు. పింక్ కలర్ ఓన్లీ అనే క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇటీవల నిజాంపట్నం మత్స్యకార భరోసా సభలో పవన్ పై విమర్శల కోసం దాదాపు అరగంట సమయం కేటాయించారు సీఎం జగన్. చంద్రబాబుకంటే ఎక్కువగా పవన్ నే టార్గెట్ చేశారు. ప్యాకేజ్ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కి బాగానే మండినట్టుంది. ఈరోజు ఉదయాన్నే జగన్ పై పాపం పసివాడు అంటూ ట్వీట్ వేసిన పవన్, మధ్యాహ్నానికి దాన్ని అప్డేట్ చేశారు. పాపం పసివాడు - నోట్లో వేలు పెడితే కొరకలేడు అంటూ సినిమా పోస్టర్ లాగా ఓ కార్టూన్ వదిలారు. పవన్ కల్యాణ్ ట్వీట్లు, కార్టూన్లు చూస్తుంటే, సీఎం జగన్ మాటలకు ఆయన బాగా హర్ట్ అయినట్టు అర్థమవుతోంది.
సీఎం జగన్ తో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తే బాగుంటుంది అంటూ ఈరోజు ఉదయాన్నే కౌంటర్లు మొదలు పెట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు జగన్ పై కార్టూన్ వదిలారు. ఆయన చేతిలో సూట్ కేసులు ఉన్నట్టుగా ఆ సూట్ కేసుల్లో డబ్బులున్నట్టుగా కార్టూన్ వేయించారు. జగన్ నటించిన పాపం పసివాడు ఎప్పుడో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది అంటూ కామెంట్ జతచేశారు. ఈ సినిమాకు రచన, నిర్వహణ, దర్శకత్వం.. అన్నీ జగనే అని వేయించారు. పింక్ కలర్ ఓన్లీ అనే క్యాప్షన్ కూడా పెట్టారు.
దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు అంటూ.. సీఎం జగన్ ప్రతి సభలోనూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే మత్స్యకార భరోసా సభలో మాత్రం పవన్ ని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశారు. సీఎం సీటు వద్దు, ప్యాకేజీ ఉంటే చాలు అని కౌంటర్లిచ్చారు. జనసైనికులు కూడా ఘాటుగా రియాక్షన్లు ఇచ్చారు. అయితే పవన్ ఈ స్థాయిలో బదులిస్తారని ఎవరూ అనుకోలేదు. నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ పవన్ ట్వీట్లు వేశారు. ఈ ట్వీట్ల వ్యవహారంపై వైసీపీనుంచి అధికారికంగా ఇంకా ఎవరూ స్పందించలేదు. వైసీపీ నేతలు కూడా ట్వీట్లతోనే సరిపెడతారా లేక ప్రెస్ మీట్లు పెడతారా.. అనేది తేలాల్సి ఉంది.