ఎలా సంపాదించావ్‌ బాబూ.. వజ్రాలు పండించా?

ప్రజల దృష్టిలో నిజం అంటే జగన్‌.. అబద్ధం అంటే చంద్రబాబు.. అనేది బలంగా ఉందని మంత్రి కారుమూరి చెప్పారు. ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేయడం వల్లే జగన్‌ అంటే నిజం అని జనం అనుకుంటున్నారన్నారు.;

Advertisement
Update:2024-03-06 09:29 IST
ఎలా సంపాదించావ్‌ బాబూ.. వజ్రాలు పండించా?
  • whatsapp icon

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. బాబు అధికారంలో ఉండగా దొరికినకాడికి అడ్డంగా దోచుకున్నాడని, అందుకే జైలుకు వెళ్లాడని మంత్రి విమర్శించారు. తన ఆస్తి రూ.2 లక్షల కోట్లు అని చంద్రబాబు గతంలో బహిరంగంగా ప్రకటించడాన్ని గుర్తుచేస్తూ ఆయన బహిరంగ వేదికపై నిలదీశారు. అంత ఆస్తి ఎలా వచ్చింది బాబూ.. నీకు వారసత్వంగా వచ్చిన రెండెకరాల భూమిలో వజ్రాలు పండించి రూ.2 లక్షల కోట్లు సంపాదించావా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజం అంటే జగన్‌.. అబద్ధం అంటే చంద్రబాబు..

ప్రజల దృష్టిలో నిజం అంటే జగన్‌.. అబద్ధం అంటే చంద్రబాబు.. అనేది బలంగా ఉందని మంత్రి కారుమూరి చెప్పారు. ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేయడం వల్లే జగన్‌ అంటే నిజం అని జనం అనుకుంటున్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేయకపోగా.. మ్యానిఫెస్టోని కూడా మాయం చేసిన చరిత్ర అబద్ధాల బాబుదని ఆయన మండిపడ్డారు. తన 14 ఏళ్ల పాలనలో చేసిన మంచి పని ఒక్కటీ లేకపోవడం వల్లే బాబు ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ పని అయిపోయిందని, 175 సా నాల్లో సింగిల్‌గా పోటీ చేయలేక జనసేనతో జట్టు కట్టిందని మంత్రి విమర్శించారు. బలహీన వర్గాల వారందరికీ సంక్షేమం అందించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌ను అధఃపాతాళానికి తొక్కేస్తానంటున్నావా..? అంటూ మంత్రి ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News