పవన్ కి 7 పాఠాలు.. హోం వర్క్ కూడా ఇచ్చిన బొత్స

'ఈరోజు నుంచి నీకు నేను ట్యూషన్ చెబుతాను పవన్'.. అంటూ ఓ ట్వీట్ వేశారు. అంతే కాదు 7 పాఠాలు కూడా అందులో ఉంచారు. తాను పాఠాలు చెబుతానని, పవన్ హోం వర్క్ చేయాలని పేర్కొన్నారు బొత్స.

Advertisement
Update:2023-07-23 09:12 IST

జనసేనాని పవన్ కల్యాణ్, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఏపీ విద్యా వ్యవస్థపై పవన్ సెటైరికల్ ట్వీట్ కి అంతే సెటైరిక్ గా స్పందించారు మంత్రి బొత్స. 'ఈరోజు నుంచి నీకు నేను ట్యూషన్ చెబుతాను పవన్'.. అంటూ ఓ ట్వీట్ వేశారు. అంతే కాదు 7 పాఠాలు కూడా అందులో ఉంచారు. తాను పాఠాలు చెబుతానని, పవన్ హోం వర్క్ చేయాలని పేర్కొన్నారు బొత్స.

పవన్ ట్వీట్ ఏంటి..?

విద్యార్థులకు ట్యాబ్ ల కంటే ముందు మరుగుదొడ్లు నిర్మించండి..

యాప్స్ తర్వాత ముందు టీచర్లను నియమించండి..

అంటూ పవన్ కల్యాణ్ ఏపీ విద్యావ్యవస్థపై ట్వీట్లు వేశారు. ట్యాబ్ ల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని. నష్టాల్లో ఉన్న బైజూస్ వంటి కంపెనీలకు ఆన్ లైన్ పాఠాల పేరుతో పెద్ద మొత్తం సమర్పిస్తున్నారని. డిజిటల్ బోధన అనేది పెద్ద మోసం అని, దానివల్ల విద్యార్థులకు లాభం లేదని, వైసీపీ నాయకులు కాంట్రాక్ట్ ల పేరుతో కోట్లు నొక్కేశారంటూ పేపర్ కటింగ్ లను కూడా సాక్ష్యాలుగా చూపించారు పవన్. పైగా ఈ ట్వీట్ లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా మెన్షన్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కలకలం సృష్టించింది.


బొత్స సమాధానం..

పవన్ కల్యాణ్ ట్వీట్ కి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. టెండర్లలో అక్రమాలేవీ జరగలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఇస్తూ 7 లెసన్స్ అనే పేరుతో పవన్ పై సెటైర్లు వేశారు మంత్రి బొత్స. అనవసరంగా ప్రభుత్వంపై బురదజల్లొద్దని హితవు పలికారు. 



Tags:    
Advertisement

Similar News