నారా లోకేశ్‌ను ర్యాగింగ్ చేసి పారేసిన మాజీ మంత్రి కొడాలి నాని

లోకేశ్‌కు పాదయాత్ర చేయడం కంటే ప్రశాంత అత్తగా (వీడి భాష నాకు కూడా వస్తోందని నాని సవరించుకొని) తిని పడుకోవడం ఇష్టం అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-02-04 15:26 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేయడంపై వైసీపీ మాజీ మంత్రి, గన్నవరం ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. 'పప్పు గుత్తి' పాదయాత్ర అంటూ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో సీఎం జగన్‌పై తన నోటికి అనిపించిదల్లా వాగుతున్నాడు. ఏకంగా సీఎంను పట్టుకొని 'అరేయ్ జగన్ రెడ్డి.. నీకు దమ్ముంటే రారా ఇక్కడికి ' అంటూ చిత్తూరు జిల్లా నుంచి పిలుస్తున్నాడు. స్కూల్ పిల్లల జూమ్ మీటింగ్‌లో కూడా సరిగా మాట్లాడలేక తెల్ల మెహం వేసిన నారా లోకేశ్.. సీఎంపై ఇష్టానుసారం మాట్లాడటం ఏంటని కొడాలి నాని మండిపడ్డారు.

లోకేశ్‌కు పాదయాత్ర చేయడం కంటే ప్రశాంత అత్తగా (వీడి భాష నాకు కూడా వస్తోందని నాని సవరించుకున్నారు) తిని పడుకోవడం ఇష్టం అంటూ ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి చంద్రబాబును ముసలోడంటే ఒప్పుకోడు. ఇప్పుడు లోకేశ్ ఏమంటాడంటే.. జగన్ మోహన్ రెడ్డి నువ్వు రా.. గుడి మెట్లు మా నాన్న బాగా ఎక్కుతాడో.. నువ్వు ఎక్కుతావో చూస్తానంటూ సవాలు చేస్తున్నాడు. బాబూ లోకేశ్.. మీ నాన్న ముసలోడు కాబట్టే.. కాళ్లు సరిగా పని చేయడం లేదు కాబట్టే నిన్ను పాదయాత్రకు పంపాడు. నువ్వు పనికి మాలిన పప్పుగాడివి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మవి అని తెలిసినా.. మీ నాన్నకు దిక్కులేక, నడవడం రాక, మైండ్ పని చేయక నిన్ను పంపాడని నాని ఘాటుగా విమర్శించారు.

కానీ.. నీకేమో మాట్లాడటం రాదు.. నోరు తిరగదు.. తినటానికి తప్పించి ఆ నోరు దేనికీ పనికిరాదని సెటైర్ వేశారు. సర్లే నువ్వు పాదయాత్ర చేస్తూ మాట్లాడుతుంటే ఏపీ ప్రజలకు కాసేపు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. నీ లాంటి కొడుకు మాకు వద్దని ప్రజలు ప్రార్థనలు చేసుకుంటారని మేము అనుకున్నాం. కానీ నీకేమో తొడలు రుద్దుకొని పోయి మంటలు పెడుతున్నాయి. పాపం దాంతో ఎక్కువ దూరం నడవలేక పోతున్నావు. రోజుకు నడిచేదే 10 కిలోమీటర్లు.. అది కూడా పాపం చాలా కష్టంగా నడుస్తున్నావు. అసలు దీనికి నువ్వు మీ నాన్న చంద్రబాబును తిట్టుకోవాలని కొడాలి నాని అన్నారు. పాపం అందుకే నారా లోకేశ్ వాళ్ల నాన్నను తిట్టుకోలేక.. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో మీటింగ్ పెట్టి రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రావాలని కోరారు. కానీ తీరా చూస్తే అక్కడన్నీ ఖాళీ కుర్చీలే కనిపించాయని ఎద్దేవా చేశారు. నారా లోకేశ్ పాదయాత్ర వెంట ఎవరూ రావడం లేదని.. బహిరంగ సభ పెట్టినా జనం ఉండటం లేదని అన్నారు. కొన్ని రోజులు చూసి ఇక ఇరుకు సందుల్లో సభలు పెట్టి బాగా జనాలు ఉన్నారని చూపించుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు.

సొంత మీడియా కూడా చూపించడం లేదనే బాధతో సందుల్లో బిల్డింగులు ఎక్కి ప్రసంగిస్తున్నాడు. బాబూ.. నాయనా అలా అనుమతి లేకుండా బిల్డింగ్‌పై ఎక్కి ప్రసంగించొద్దు అంటే.. జగన్ మోహన్ రెడ్డికే సవాలు విసురుతున్నారు. నీబోటి ప్లాట్‌ఫామ్ గాళ్లు రోజూ రోడ్లపై తిరుగుతుంటారు. వారిని పట్టించుకోవల్సిన అవసరం సీఎంకు ఏం ఉందని.. నిన్ను, మీ నాన్న లాంటి వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉన్నారు. వాళ్లు చాలని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

టూరిస్టు రాజకీయ నాయకులు..

నారావారిపల్లె నుంచి హైదరాబాద్ వలస వెల్లిన కుటుంబం మీది. మీ నాన్న వైపు గానీ, అమ్మవైపు కుటుంబం కానీ అందరూ సొంత ఊర్ల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయి స్థిరపడిన వాళ్లే. ఏదో సంక్రాంతికి కుటుంబాన్ని వెంటేసుకొని వచ్చి రెండు రోజులు ఉండి పోతారు మీరు. మీ దత్త పుత్రుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటాడు. నువ్వు మంగళగిరికి, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకకు వలస వచ్చి పోటీ చేశారు. మీరు టూరిస్టు రాజకీయ నాయకులు అని నాని ఎద్దేవా చేశారు.

మీ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు?

నిన్ననో మొన్ననో బాబాయ్‌పై గొడ్డలి వేటు వేయించాడు జగన్ మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు లోకేశ్ పేలుతున్నాడు. మరి నీ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? నీకు కూడా రామ్మూర్తి నాయుడు అనే బాబాయ్ ఉన్నాడుగా.. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబును తిట్టాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడా ఎందుకు కనపడటం లేదు? 10 ఏళ్లు ప్రజాప్రతినిధిగా పని చేసిన ఆయన బతికే ఉన్నాడా? ముందు నీ బాబాయ్‌ని చూపించు అని సవాల్ చేశారు.

వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కుటుంబ సభ్యులు వారి అనుమానాలను చెప్పారు. సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఎంపీ అవినాశ్ రెడ్డితో ఎవరో మాట్లాడారని వాళ్లే ముద్దాయిలంటూ ఈ పచ్చ మీడియాతో కలిసి డిసైడ్ చేస్తున్నారు అని ఆరోపించారు. సీఎం జగన్ ఇంట్లో ఉన్నారా? ఏం చేస్తున్నారని కనుక్కోవడానికి అవినాశ్ గానీ నేను గానీ నవీన్‌కు కాల్ చేస్తుంటాము. లేదంటే ఇతరులకు చేస్తాం. దాన్నే పెద్ద రాద్దాంతం చేస్తారా అని ఫైర్ అయ్యారు. మొత్తానికి కొడాలి నాని ఇవ్వాళ ప్రెస్ మీట్‌లో పూర్తిగా నారా లోకేశ్‌ను ర్యాగింగ్ చేసి పారేశారు.

Tags:    
Advertisement

Similar News