జనసేన నేత కిరణ్‌ రాయల్‌ అక్రమాలు..మహిళ సూసైడ్ అటెంప్ట్

జనసేన నేత కిరణ్‌ రాయల్‌ తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది.

Advertisement
Update:2025-02-08 19:09 IST

తిరుపతి జనసేన ఇంఛార్జీ కిరణ్ రాయల్ అక్రమాలు అరాచకాలు బట్టబయలు అయ్యాయి. తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తాను అప్పు చేసి గోల్డ్ తాకట్టు పెట్టి ఆ మొత్తాన్ని ఇచ్చానని స్పష్టం చేసింది. నా వద్ద నుంచి కిరణ్‌ రాయల్ అనే వ్యక్తి కోటి 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. నేను కూడా అప్పు చేయడమే కాకుండా ఉన్న బంగారన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును తెచ్చాను.

రూ. 30 లక్షలు ఇచ్చేందుకుబాండ్స్‌, చెక్‌ రాసిచ్చాడు. నన్ను బెదిరించి, భయపెట్టి వీడియో తీసుకున్నారు. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ల వద్ద నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. నాకు చావే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది లక్ష్మి అనే మహిళ. తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాసేపటికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమెకు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News