సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం సమావేశం అయ్యింది.
Advertisement
ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047-విజన్ డాక్యుమెంట్ పై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో లోటు బడ్జెట్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సరిపోవడం లేదని, సూపర్ సిక్స్ గ్యారెంటీలకు కూడా నిధుల లోటు గురించి ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సైతం ఈ మీటింగులో పాల్గొన్నారు
Advertisement