వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్‌

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్‌

Advertisement
Update:2025-02-07 11:14 IST

మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ మాజీ మంత్రి శైలజానాథ్‌ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నుంచి శైలజానాథ్‌ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. సింగనమల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకే శైలజానాథ్‌ ను పార్టీలో చేర్చుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News