విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌.. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Advertisement
Update:2025-02-07 21:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రి మంలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా, వాల్తేరు రైల్వే డివిజన్‌ను సౌత్‌ విశాఖ డివిజన్‌గా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిజానికి సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని ఐదేళ్ల క్రితమే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఐదేళ్లుగా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తాజాగా ఒత్తిడి తీసుకోవడంతో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌ దీనికి శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. అయితే వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి, దాని స్థానంలో విశాఖ డివిజన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డీపీఆర్‌ సిద్ధమవుతోంది. అయితే రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ జోన్‌లో విశాఖ డివిజన్‌ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డీపీఆర్‌ సిద్ధం చేయాలని జోన్‌ ప్రత్యేక అధికారికి ఇప్పటికే ఆదేశాలు అందాయి. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఏపీ విభజన చట్టంలోని హామీ మేరకు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News