విజయసాయి రెడ్డిపై జగన్ షాకింగ్ కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
వైసీపీ అధినేత జగన్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలి. ప్రలోభాలకు లొంగో.. భయపడో లేక రాజీపడో అటు పోతే.. విశ్వసనీయత సంగతేంటి.. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైమ్ వస్తుంది.
విశ్వసనీయత ముఖ్యం. ఇది విజయసాయిరెడ్డికైనా మిగతా వారికైనా వర్తిస్తుంది.’ అని జగన్ అన్నారు. మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో పాటు నలుగురు వెళ్లిపోయారు. అయినప్పటికీ వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది విజయసాయి రెడ్డికైనా.. ఇప్పటివరకు పోయినవారికైనా వర్తిస్తుంది. వైసీపీ కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది” అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలన రేకెత్తిస్తున్నాయి.
Advertisement