ప్రపంచానికే గర్వకారణంగా నిలిచేలా విశాఖ అభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ, ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్న రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఐటీకి కేంద్రంగా ఉన్నదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఐటీతో పాటు డీప్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కేంద్రంగా విశాఖను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎక్కడికి వెళ్లినా విశాఖను టెక్ హబ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. బుధవారం ప్రధాని మోడీ రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. లోకేశ్ కృషితో విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నది. గుగూల్ కూడా పెట్టుబడులు పెట్టనున్నది.
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్టో వచ్చాకే అభివృద్ధి ఒక స్థాయిలో పెరిగింది. విశాఖకు బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో వస్తే నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ, ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ నగరాన్ని ప్రపంచానికే గర్వకారణంగా నిలిచేలా తీర్చిదిద్దుతాం. పౌర విమానయాన శాఖ తరఫున డ్రోన్ టెక్నాలజీ, ఏవియేషన్‌నలో ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నామని రామ్మోహన్‌నాయుడు చెప్పారు.