పేర్ని నానికి హైకోర్టులో ఊరట

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

Advertisement
Update:2024-12-31 15:19 IST

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను ఏ6గా చేర్చడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. నానిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.

 ఇదే కేసులో ఆయన భార్యకు కృష్ణా జిల్లా కోర్టు ముందుస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్‌ పోలీసులు సోమవారం రాత్రి నలుగురి ని అరెస్టు చేశారు. గోడౌన్‌ మేనేజర్‌ మా­నస తేజ, సివిల్‌ సప్లయీస్‌ అసిస్టెంట్‌ మేనే­జర్‌ కోటిరెడ్డి, లారీ డ్రైవర్‌ మంగారావు, లారీ డ్రైవర్‌ స్నేహి తుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్‌ విధించారు.

Tags:    
Advertisement

Similar News