తిరుమలకు భారీ ఆభరణాలతో భక్తుడు

5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి మంగళవారం తిరుమలకు వచ్చిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్‌కుమార్‌

Advertisement
Update:2025-01-01 09:03 IST

హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్‌కుమార్‌ 5 కిలోల బంగారు ఆభరణాలు ధరించి మంగళవారం తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ధరించిన భారీ ఆభరణాలను తోటి భక్తులు ఆసక్తిగా గమనించారు. విజయ్‌కుమార్‌ తరుచూ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. బంగారంపై ఉన్న ఆసక్తితోనే భారీ ఆభరణాలు చేయించుకొని ధరిస్తున్నట్లు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News