ఏపీ సిట్ నుంచి నలుగురు డీఎస్పీలు ఔట్
సిట్‌లో ఇతర శాఖల అధికారులను చేర్చిన ఏపీ సర్కారు
Advertisement
ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం దందా, అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు డీఎస్పీలను తప్పించారు. వారి స్థానంలో ఇతర శాఖల అధికారులను నియమిస్తూ సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఆరుగురితో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌లో సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్ రావు, బీసీ వెల్ఫేర్ ఈడీ (కాకినాడ) శ్రీనివాసరావు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్జేడీ (కర్నూలు) రోహిణి, విజయనగరం డీఎస్‌వో మధుసూదన్ రావు, కోనసీమ జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ బాల సరస్వతిని సభ్యులుగా నియమించారు. కాకినాడలో నమోదైన బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన 13 కేసులపై సిట్ విచారణ జరుపుతోంది.
Advertisement