విజయవాడ కనక దుర్గమ్మ సేవలో సీఎం చంద్రబాబు
ఏపీ చంద్రబాబు నూతన సంవత్సరం సందర్భంగా కనక దుర్గమ్మను దర్శించుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలు పలికి... తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతు తెలుగు రాష్ట్రాలతో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులందరికీ న్యూ ఇయర్ విషెష్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు వివరించారు. ఈ ఏడాది అన్నింటా శుభం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ ఆదాయం పెరిగి, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చంద్రబాబు చెప్పారు.సీఎం చంద్రబాబు రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.