ఏపీలో మూడు రోజులు వాలంటీర్ల నిరసన
వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.
ఏపీలో వాలంటీర్లు రేపటి నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టనున్నట్టు స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య తెలిపారు. నిరసన కార్యక్రమాలలో భాగంగా జనవరి 02న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్ లకు వాలంటీర్లు వినతి పత్రాలను అందజేయనున్నారు. జనవరి 03న జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చొని బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ.. జనవరి 04న బ్యాక్ టూ వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఈశ్వరయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వంలో ఆ వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.