రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరైన పేర్ని జయసుధ

రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
Update:2025-01-01 17:12 IST

రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మధ్యాహ్నం బందరు పోలీస్ స్టేషన్‌కు పేర్ని జయసుధ వచ్చారు. తన లాయర్లతో విచారణకు హాజరైన ఆమెను రేషన్ బియ్యం మాయం అంశంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు . రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని .. తన భార్య పేరిట గోడౌన్లు నిర్మించారు. అందులో రేషన్ బియ్యం బఫర్ నిల్వలను ఉంచారు. అయితే ఇటీవల వార్షిక తనిఖీల్లో భాగంగా సదరు గోడౌన్లలో సివిల్ సప్లై అధికారి కోటిరెడ్డి సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో దస్త్రాల్లో ఉన్న బియ్యం బస్తాల నిల్వలకు.. గోడౌన్లలో ఉన్న సరకుకు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు.

దాదాపు వేలాది బియ్యం బస్తాల తేడా ఉండడంతో... జయసుధకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు వే బ్రిడ్జ్‌లో సమస్యలు ఉన్నాయని.. అందువల్ల ఈ తేడా అంటూ పేర్ని నాని పౌర సరఫరాల శాఖ అధికారులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ అంతలోనే రేషన్ బియ్యం ఎంత మాయం అయిందో అంతకు నగదు చెల్లించేందుకు పేర్ని నాని సతీమణి జయసుధ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో రూ.1.70 కోట్ల నగదు డీడీని ప్రభుత్వానికి చెల్లించారు .ఇంకోవైపు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రంగంలోకి దిగి... తనిఖీలు చేపట్టారు. దాంతో మరిన్ని బస్తాలు మాయమైనట్లు గుర్తించి... ఆ నగదు కూడా చెల్లించాలంటూ పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News