ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటునకు ఆమోదముద్ర వేయనున్నక్యాబినెట్‌

Advertisement
Update:2025-01-02 12:36 IST

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చిస్తున్నారు. అమరావతిలో రూ. 2723 కోట్లతో చేపట్టనున్న పనులు, రాష్ట్రంలో భారీ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటునకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయనున్నది.

నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలుపనున్నది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటునకు కేటాయించనున్నట్లు స్థలంపై క్యాబినెట్‌లో చర్చ జరగనున్నది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నది.

Tags:    
Advertisement

Similar News