శ్రీవారి భక్తులకు టీటీటీ గుడ్‌ న్యూస్‌

10 రోజుల పాటు రోజుల ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ తేదీలివే

Advertisement
Update:2025-01-01 13:33 IST

హిందువులకు ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే విష్ణు ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటుంటారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఏకాదశికి తిరుమల వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్న వారికి టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను అందించనున్నది.

టికెట్ల జారీ తేదీలు ఇవే

2025, జనవరి 10-19 వ తేదీ వరకు సుమారు 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 10,11,12 తేదీలకు సంబంధించి వైకుంఠ ద్వారా దర్శనాలకు జవని 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలిపి మొత్తం 91 కౌంటర్లలో టోకెన్లు అందించనున్నారు. ఇక జనవరి 13 నుంచి 19 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఏ రోజుకారోజున ముందు రోజు టోకెన్లు జారీ చేయడానికి వీలుగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News