విడివిడిగా వచ్చినా.. కలిసొచ్చినా ఓకే..
పవన్ కల్యాణ్ తనపై విష ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పవన్ రోల్ ఏంటో ప్రజలందరికీ తెలుసని ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడివిడిగా వచ్చినా.. కలిసొచ్చినా తమకు ఓకేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే ముందుగా సీఎం అభ్యర్థి ఎవరనేది క్లారిటీకి రావాలని ఆయన సూచించారు. గురువారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తనపై విష ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పవన్ రోల్ ఏంటో ప్రజలందరికీ తెలుసని ఆయన స్పష్టం చేశారు.
సబ్‌ప్లాన్ దుర్వినియోగం ఆరోపణలపై పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా.. అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ కల్యాణ్ మాట్లాడుతారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో అంతా డొల్లే కాబట్టి ప్రచారం ఎక్కువ చేసుకున్నారని ఆయన తెలిపారు.